Donald Trump: భారత్‌తో మాకు మంచి సంబంధాలు… అయినా వారిపై

భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి పేర్కొన్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన చెకర్స్‌లో ప్రధాని స్టార్మర్ (Stormer)తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్ (Ukraine) పై పుతిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం తనను బాగా నిరాశ పరిచిందని వెల్లడిరచారు. ప్రధాని మోదీ సన్నిహిత స్నేహితుడే అయినా రష్యా (Russia) నుంచి చమురును కొనడంవల్ల అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సుంకాలవల్ల చమురును రష్యా నుంచి భారత్ తీసుకోకపోతే ధరలు దిగి వస్తాయి. అప్పుడు పుతిన్ చేతులెత్తేస్తారు. ఆయనకు మరో మార్గం ఉండదు అని పేర్కొన్నారు. మాకు భారత్ తో సన్నిహిత సంబంధాలున్నాయని మీకు తెలుసు. ప్రధాని మోదీ (Modi) నాకు బాగా దగ్గరనీ తెలుసు. ఇటీవలే ఆయనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మాకు మంచి సంబంధాలున్నాయి. అయినా వారిపై సుంకాలను విధాంచా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.