Donald Trump: నేనూ, మోడీ చాలా క్లోజ్.. రూటు మార్చిన డొనాల్డ్ ట్రంప్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌ను విమర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన వైఖరిని మార్చుకున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ప్రధాని మోడీతో (PM M odi) తనకున్న స్నేహాన్ని ప్రస్తావించారు. “నేను భారత్‌కు చాలా సన్నిహితంగా ఉంటాను. ప్రధాని మోడీతో కూడా అంతే క్లోజ్‌గా ఉంటాను. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశాను. మా ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహ బంధం ఉంది” అని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు.
అయితే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆయన యూరోపియన్ దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎవరి కోసం అయితే నేను రష్యాతో పోరాడుతున్నానో, వారే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసం?” అని ఆయన (Donald Trump) ప్రశ్నించారు.