మరోసారి భారత్ మద్దతు కోరిన అమెరికా
ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు మద్దతు ప్రకటించాలంటూ అమెరికా భారత్కు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా అమెరికాతో భారత్కు ఉన్న మైత్రిని గుర్తు చేసుకుంది. ఇటీవల ప్రధాని మోదీ మాస్కోలో పర్యటించడంపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. భారత్తో తమకు అనేక రంగాల్లో కీలక భాగస్వామ్యముందని, ఇది గత వేసవిలో భారత ప్రధాని అమెరికాలో పర్యటించినప్పుడు స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పడానికి భారత్తో సహా, అన్ని దేశాలకు మేం మద్దతు కోరుతూనే ఉంటామని ఈ సందర్భంగా వేదాంత్ పటేల్ వ్యాఖ్యానించారు.






