ఏడేళ్ల తర్వాత రంగంలోకి దించిన అమెరికా
ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా అమెరికా తన బి-1బి బాంబర్‌ను రంగంలోకి దించింది. కొరియన్ ద్వీపకల్పంపై ఇది గగనవిహారం చేసింది. దక్షిణ కొరియాతో కలిసి బాంబింగ్ విన్యాసాలను నిర్వహించింది. ఏడళ్లలో ఈ బాంబర్ ఈ ప్రాంతంలో గగనవిహారం చేయడం ఇదే మొదటిసారి. ఈ విన్యాసాల్లో అమెరికా, దక్షిణ కొరియాలకు చెందిన అనేక యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వీటిలో బి-1బి బాంబర్, జాయింట్ డైరెక్టర్ అటాక్ మ్యునిషన్ (జ్యేడామ్) అనే బాంబులను జారవిడిచింది. చివరిసారిగా ఈ బాంబరు 2017లో కొరియా ద్వీపకల్పంపై గగనవిహారం చేసింది. జేడ్యామ్ అనేది ఒక మార్గనిర్దేశక వ్యవస్థ. ఇది సంప్రదాయ అన్‌గైడెడ్ బాంబులను మరింత కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగల జీపీఎస్ గైడెడ్ ఆయుధాలుగా మారుస్తుంది. అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లు ఈ జేడ్యామ్లను ప్రయోగించగలవు. రష్యా దాడులను ఎదుర్కోవడానికి వీటిని ఉక్రెయిన్‌కు సరఫరా చేస్తోంది.






