ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య త్వరలోనే : అమెరికా
హెజ్బొల్లా తీవ్రవాదులు-ఇజ్రాయెల్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం త్వరలోనే నిలిచిపోతుందన్న ఆశాభావాన్ని అమెరికా దౌత్యధికారి అమోస్ హాచిస్టీన్ వ్యక్తం చేశారు. బీరుట్లో లెబనాన్ పార్లమెంటు స్పీకర్ నబిప్ా బెరితో చర్చల అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. హెజ్బొల్లా ప్రతినిధిగా వ్యవహరించిన నిబిప్ాతో యుద్ధ విరామ మంతనాలు నిర్మాణాత్మకంగా కొనసాగాయన్నారు. అయితే, గాజా స్ట్రిప్ విషయంలో ఇలాంటి ఆశ లేదన్నారు. దక్షిణ లెబానన్లోని ఐరాస బఫర్ జోన్ నుంచి ఇజ్రాయెల్ సైనికులు, హెజ్బొల్లా మిలిటెంట్లు వెనక్కి వెళ్లాలన్న ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని తెలిపారు.






