Boyapati Srinu: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ మాస్ డైరెక్టర్?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను(Boyapati Srinu) కు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. బోయపాటి సినిమాలంటే యాక్షన్, ఫైట్లు, తలలు తెగడం ఇవి కామన్. బోయపాటి మాస్ సినిమాలకు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాల హిందీ హక్కులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి అఖండ2(Akhanda2)ను పాన్ ఇండియా స్థాయిలో తీశాడు.
కానీ అఖండ2 అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. అయినా సరే బోయపాటి పట్టు వదలడం లేదు. బాలీవుడ్ లో తన మార్క్ వేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడి హీరోతో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే బోయపాటి రీసెంట్ గా ముంబైకు వెళ్లి ఓ స్టార్ హీరోను కలిశాడని సమాచారం.
అతను మరెవరో కాదు, రీసెంట్ గా దురంధర్(Durandhar) మూవీతో భారీ సక్సెస్ ను అందుకున్న రణ్వీర్ సింగ్(Ranveer Singh). ఈ సక్సెస్ఫుల్ ను బోయపాటి ఇటీవలే ముంబైలో కలిసి, డిస్కషన్స్ చేశారని తెలుస్తోంది. రణ్వీర్ కూడా ఎప్పట్నుంచో సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వర్కవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే బోయపాటి బాలీవుడ్ లో రికార్డులు సృష్టించడం ఖాయమైనట్టే.






