Nithin: చేతులు మారిన మరో ప్రాజెక్టు
గత కొన్ని సినిమాలుగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(nithin) సిట్యుయేషన్ అస్సలు బాలేదు. అతన్నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. నితిన్ లాస్ట్ మూవీ తమ్ముడు(thammudu) సినిమాకైతే అసలు దారుణమైన ఓపెనింగ్స్, కలెక్షన్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నితిన్ చేసే సినిమాలను ఆడియన్స్ రిజెక్ట్ చేస్తున్నారు.
తమ్ముడు తర్వాత నితిన్ ఇటీవలే విభిన్న కథలతో సినిమాలను తీసే వి.ఐ ఆనంద్(VI Anand) దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా తప్ప నితిన్ మరో ప్రాజెక్టును ఒప్పుకున్నది లేదు. వాస్తవానికి నితిన్ వద్దకు మధ్యలో పలు ప్రాజెక్టులు వచ్చాయి. అందులో ఇష్క్(Ishq) ఫేమ్ విక్రమ్ కె. కుమార్(Vikram K Kumar) ప్రాజెక్టు కూడా ఒకటి. ఇష్క్ తర్వాత వీరి కలయికలో రాబోయే సినిమా కావడంతో అందరికీ ఈ ప్రాజెక్టు పై ఎగ్జైట్మెంట్ వచ్చింది.
కానీ ఇప్పుడా ప్రాజెక్టు నితిన్ నుంచి విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా విక్రమ్, విజయ్ మధ్య డిస్కషన్స్ జరిగాయని, విజయ్ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. బడ్జెట్, రెమ్యూనరేషన్ విషయాల్లో క్లారిటీ వస్తే సినిమా ఓకే అయినట్టేనట. అన్నీ కుదిరితే యువి క్రియేషన్స్(UV Creations) ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. విజయ్ ప్రస్తుతం చేస్తున్న రౌడీ జనార్ధన(Rowdy janardhana), రణబాలి(Ranabaali) సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా చేసే అవకాశముంది.






