Vijay Sethupathi: అందులోనే నిజమైన సంతృప్తి ఉంది
విజయ్ సేతుపతి(vijay sethupathi). ఇండియాలో ఈయన గురించి తెలియన సినీ లవర్ ఉండరంటే అతిశయోక్తి లేదు. కోలీవుడ్ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన సేతుపతి తర్వాత అన్ని భాషల్లోనూ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉప్పెన(Uppena) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్ సేతుపతి ఓ వైపు నటుడిగా ఉంటూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తారనే సంగతి తెలిసిందే.
విజయ్ సేతుపతి ఫిల్మ్ ప్రొడక్షన్స్(Vijaysethupathy film productions) అనే సంస్థను స్థాపించి అందులో సినిమాలను నిర్మించి, దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించి, డబ్బు సంపాదించి, ఆ డబ్బుతో నలుగురికి సాయపడాలనుకున్నారట. కానీ ఆ నిర్మాతగా తనకు లాభాల కంటే నష్టాలే ఎదురయ్యాయని, సొంత బ్యానర్ ను పెట్టి డబ్బులు పోగొట్టుకున్నానని విజయ్ సేతుపతి అంటున్నారు.
కిషోర్ పాండురంగ్ బెలేకర్(kishore pandurang belekar) దర్శకత్వంలో తెరకెక్కిన గాంధీ టాక్స్(gandhi talks) సినిమా ఈ నెల 30వ తేదీన రిలీజవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ సేతుపతి ఈ విషయాన్ని వెల్లడించాడు. నిర్మాతగా తాను లాభపడింది లేదని, తానేం చేసినా తన చుట్టూ ఉండేవారి కోసమే చేస్తానని, అలా చేయడంలోనే తనకు అసలైన సంతృప్తి ఉంటుందని సేతుపతి తెలిపారు. గత ఆరేళ్లుగా ఉపాధి లేనివారికి జాబ్స్ ఇప్పించడానికి నెలకు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు.






