Guna Sekhar: 8 ఏళ్లు టైమ్ వేస్ట్ చేశా.. ఇక ముందు అలా ఉండదు
ఎలాంటి జానర్ సినిమాలనైనా తనదైన స్టైల్ లో తెరకెక్కించగల డైరెక్టర్ గుణ శేఖర్(Guna Sekhar). ఆయన్నుంచి ఎన్నో సినిమాలు రాగా వాటిలో కొన్ని హిట్టవగా, మరికొన్ని ఫ్లాపులుగా నిలిచాయి. అయితే గుణశేఖర్ గత కొన్నేళ్లుగా ఎక్కువగా సినిమాలు చేసింది లేదు. రుద్రమదేవి(Rudramadevi) తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న గుణశేఖర్, 8 ఏళ్ల తర్వాత శాకుంతలం(Saakunthala) తీశాడు.
ఆ సినిమా ఫ్లాపవడంతో తన నెక్ట్స్ మూవీ లేటైంది. ఇప్పుడు గుణశేఖర్ నుంచి యుఫోరియా(Euphoria) అనే సినిమా రాబోతుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న గుణశేఖర్ ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు తప్పక నచ్చుతుందని చెప్తున్నారు. ఇదే సందర్భంగా ఆయన తన కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి కూడా మాట్లాడారు.
తన 33 ఏళ్ల కెరీర్లో విలువైన 8 ఏళ్లను తాను వృధా చేశానని, కానీ ఇకపై ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానని, కొత్త ఆలోచనలతో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడమే తన టార్గెట్ అని, గతంతో పోలిస్తే తన అనుభవం, ఆలోచనా విధానం కూడా చాలా మారాయని, భవిష్యత్తులో తన నుంచి రాబోయే సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయని గుణశేఖర్ చెప్పారు.






