అమెరికా మరో కీలక నిర్ణయం … తైవాన్‌కు భారీగా
చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తైవాన్‌కు 385 మిలియన్ డాలర్ల ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధికారం నుంచి వైదొలుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్- తె పసిఫిక్ దేశాల పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్-16 జెట్లు, రాడార్ల విడిభాగాలతో సహా 385 మిలియన్ డాలర్ల ఆయుధాలను తైవాన్‌కు విక్రయించాలని అమెరికా నిర్ణయించినట్లు పెంటగాన్ పేర్కొంది.






