అమెరికా, ఫిలిప్పీన్స్‌ల మధ్య కీలక ఒప్పందం
ఫిలిప్పీన్స్‌కు అమెరికా అందించే కీలక ఆయుధాలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం, ముఖ్య సాంకేతికతను బదిలీ చేసేలా మనీలాలో ఇరుదేశాల మధ్య సైనిక ఒప్పందం జరిగింది. ఆసియా ఖండంలో చైనా దూకుడు పెరుగుతున్న వేళ ఈ దీర్ఘకాల మిత్రుదేశాల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాలతో పాటు భారీ సంయుక్త సైనిక విన్యాసాలు చేసేలా అమెరికా, ఫిలిప్పీన్స్ దేశాల రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిన్, గిల్బర్టో టియోడోరోలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. హిందూ `పిసిఫిక్ సముద్రంలో సైనిక పొత్తులను బలోపేతం చేయడానికి, భవిష్యత్తులో తైవాన్‌పై, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై బీజింగ్ దాడులకు దిగితే చైనాను సమర్థంగా నిలువరించేందుకు బైడెన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫిలిప్పీన్స్‌కు ఆయుధాతో పాటు క్షిపణులు, డ్రోన్ల సాంకేతికతను సైతం బదిలీ చేయనుంది.






