ఆస్ట్రేలియాలో ఇద్దరు తెలుగు యువకుల మృతి
ఆస్ట్రేలియా దేశం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో జరిగిన సంఘటనలో ఇద్దరు తెలుగు యువకులు మృతి చెందారు. జలపాతంలో దిగిన ఒకరిని రక్షించబోయి మరొకరు, ఇద్దరూ మృత్యువాత పడ్డారు. మరొకరు కొన ఊపిరితో బయటపడ్డారు. ఈత కోసం దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందా లేక జారిపడిపోయారా అనేది తెలియలేదు. మృతులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముప్పరాజు చైతన్య, బొబ్బ సూర్యతేజ అని ఆస్ట్రేలియా ఎంబీసీ గుర్తించింది. వీరిలో చైతన్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరుకు, సూర్యతేజ బాపట్ల జిల్లాకు చెందినవారు. ఆస్ట్రేలియాలోని కీన్స్ ల్యాండ్ వద్ద ఉన్న మిల్లా మిల్లా జలపాతాన్ని తిలకించేందుకు వెళ్లి కన్నుమూశారు.






