America: త్వరలో భారత్తో ట్రేడ్ డీల్ : అమెరికా
భారత్తో ట్రేడ్ డీల్ (Trade deal) మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ (Howard Lutnick) ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ (Washington) లో జరిగిన భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నాయకత్వ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాలు సమష్టిగా ప్రయోజనాలను గుర్తించాయని పేర్కొన్నారు. ఇరుదేశాల చర్చలు చివరిదశకు చేరిన వేళ ఈ వ్యాఖ్యలు వెలువడటం విశేషం. ఇవి సుదీర్ఘకాలంగా జరుగుతున్న చర్చలను ముందుకు తీసుకెళ్లినట్లు వెల్లడిరచారు. సమీప భవిష్యత్తులోనే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని మీరు ఆశించవచ్చు. భారత్ సరైన వ్యక్తిని ఎంపిక చేసి పంపిస్తే, మా నుంచి చర్చలకు తగిన వ్యక్తిని పంపిస్తాం. అమెరికాలో ముందు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొన్న దేశాలకు మెరుగైన డీల్ లభిస్తుంది. జులై 4 నుంచి 9లోపు వచ్చే వారికి ఆ అవకాశం అందుకోవచ్చు అని లుట్నిక్ వ్యాఖ్యానించారు.







