అమెరికాలో టోర్నడోల బీభత్సం
అమెరికాలో ఈదురు గాలులు బీభత్సం స్పష్టించాయి. టెక్సాస్, ఓక్లహామా, అర్కన్సాస్, మిస్సోరి, కన్సాన్ ప్రాంతాలను శక్తిమంతమైన టోర్నడోలు కుదిపేశాయి. గంటలకు 80 మైళ్ల వేగంతో వీచిన గాలులకు డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన భారీ విమాననే కదిలిపోయింది. 202 విమానాలను రద్దు చేయగా, మరో 500 విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఇక టోర్నడోలతో టెక్సాస్‌లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు టెక్సాస్, ఓక్లహామా, అర్కన్సాస్, మిస్సోరీ, కెంటకీ, నార్త్ కరొలినా, వర్జీనియా రాష్ట్రాల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.






