చైనా నిర్బంధంలో ఉన్న అమెరికన్ల విడుదల
ఏళ్లతరబడి చైనా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్ పౌరులను విడుదల చేయడంతో వారు స్వదేశానికి బయలుదేరినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా కాలం ముగింపు దశకు వచ్చిన ప్రస్తుత తరుణంలో ఇరు దేశాల మద్య కుదిరిన దౌత్యపరమైన ఒప్పందంలో భాగంగా ఈ ముగ్గురి విడుదలకు మార్గం సుగమం అయినట్లు తెలిపింది. చైనా అక్రమంగా వీరిని నిర్బంధించినట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మార్క్ స్విడన్కు డ్రగ్స్ కేసులో మరణశిక్ష విధించగా, కాయ్లీ, జాన్ లీయుంగ్ అనే మిగతా ఇద్దరిపై గూఢచర్య ఆరోపణలు ఉన్నాయి.






