Los Angeles: లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టడంతో అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles ) లో తలెత్తిన ఘర్షణలు రెండో రోజు కొనసాగాయి. పోలీసులు (Police) బాష్ప వాయుగోళాలు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. వారిపై పెప్పర్ స్ప్రే కూడా ప్రయోగించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో నేషనల్ గార్డ్స్ దళాలకు చెందిన 2వేల మందిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రంగంలోకి దింపారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ నూసమ్ (Gavin Noosam) , లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ (Karen Boss) పనితీరుపై విరుచుకుపడ్డారు. ఆందోళనలను సమర్థంగా అడ్డుకోలేదని ఆక్షేపించారు. ఇక నుంచి నిరసనకారులు ముఖానికి మస్క్‌లు ధరించడానికి అనుమతించబోమని చెప్పారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాలకు నేషనల్ గార్డ్స్ దళాలు చేరకుముందే వారు అద్భుతంగా పనిచేశారనని ట్రంప్ కితాబివ్వడం గమనార్హం.







