లండన్ లో తెలంగాణ విద్యార్థి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండకు చెందిన విద్యార్థి లండన్‌లో బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లికి చెందిన రేమిడి రాహుల్‌రెడ్డి(32) మూడేళ్ల కిందట ఉన్నత విద్యకోసం లండన్ వెళ్లాడు. ఈ క్రమంలో రాహుల్ అక్కడ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కాగా నెల రోజుల కిందట గుండె సంబంధింత జబ్బుతో రాహుల్ లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 27న మృతి చెందాడు. కాగా మృతుని తల్లి ఏడేళ్ల కిందట గుండెపోటు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వివరిస్తున్నారు.






