New Zealand: న్యూజిలాండ్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలు
న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ (Akland ) లో తెలంగాణ రాష్ట్రావతరణ దిన వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో తెలంగాణ కుటుంబాల వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియన్ కాన్సులేట్ జనరల్ మోహన్ కుమార్ సేథి (Mohan Kumar Sethi) వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై ప్రవాస తెలంగాణ వాసులకు శభాకాంక్షలు తెలిపారు. ముందుగా అమర వీరుల కుటుంబాలకు నివాళులర్పించిన అనంతరం వేడుకలను ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమా లు, తెలంగాణ విశిష్టత, కళలు, సంప్రదాయాలు తదితర అంశాలపై ప్రదర్శనలను నిర్వహించారు.
అనంతరం ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. న్యూజిలాండ్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ (Koduri Chandrasekhar) మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దేశంలో జరిగిన చారిత్రాత్మక సంఘటనల్లో ఒకటన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వం తెలంగాణ వాసులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని, వేడుకల నిర్వహణకు అనుమతులు ఇచ్చి సహకరిస్తోందని తెలిపారు. సంఘం నేతలు విశ్వనాథ్, మాజీ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి (Narendra Reddy) , మేకల ప్రసన్న కుమార్‌తో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులు శివ, సత్యనారాయణ, రాజేంద్ర, ప్రదీప్, రోహిత్ పాల్గొన్నారు.







