Mahanadu: జర్మనీలో మినీ మహానాడు.. పోస్టర్ ఆవిష్కరించిన ఎన్నారై టీడీపీ నేతలు
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఈ నెల 24, 25 తేదీల్లో మినీ మహానాడు (Mini Mahanadu), ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు ఎన్నారై టీడీపీ జర్మనీ విభాగం అధ్యక్షుడు పవర్ కుర్రా తెలిపారు. ఈ మేరకు ఆయన ఎన్నారై టీడీపీ ప్రతినిధులతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) , ఎమ్మెల్యే గౌతు శిరీష (Gautham Sirisha), గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao) హాజరవుతారని తెలిపారు. యూరప్‌లోని అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు, టీడీపీ అభిమానులు మినీ మహానాడుకు తరలివస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి (Sumanth Korrapati), మినీమహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి, శివ తదితరులు పాల్గొన్నారు.







