TCS : అమెరికా ఉద్యోగులపై వివక్ష ఆరోపణలు.. ఖండిరచిన టీసీఎస్

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services ) పై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఉద్యోగుల (Employees)పై ఐటీ దిగ్గజం వివక్ష చూపిస్తోందని దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. దీనిపై అమెరికా (America) లో సమాన ఉపాధి అవకాశాల కమిషన్ దర్యాప్తు చేపట్టింది. ప్రధానంగా 40 ఏళ్లు పైబడిన దక్షిణాసియా యేతర మాజీ ఉద్యోగులు టీసీఎస్ తీరుపై పక్షపాత లే ఆఫ్‌లు (Layoffs) అమలు చేస్తోందని ఆరోపణలు చేశారు. హెచ్ 1 బీ వీసా (H1B Visa) కలిగిన భారతీయ ఉద్యోగులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. ఈ ఆరోపణల్ని టీసీఎస్ ఖండిరచింది. ఈ మాటల్లో వాస్తవం లేదని కేవలం తప్పుదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేసింది. తాము అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది.