Sudiksha Konanki మా కుమార్తె మృతిని ప్రకటించండి : సుదీక్ష తల్లిదండ్రుల విజ్ఞప్తి
డొమినికన్ రిపబ్లికన్ అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (Sudiksha konanki) కేసు మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో సుదీక్ష మృతి (Death) చెందినట్లు ప్రకటించాలని ఆమె తల్లిదండ్రులు డొమినికన్ అధికారుల (Dominican officials ) ను కోరినట్లు తెలిసింది. తమ కుమార్తె మరణం విషయంలో ఎవరిపైనా అనుమానం లేదని, అధికారులకు రాసిన లేఖ (Letter)లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అధికారులు చేస్తున్న దర్యాప్తును తాము విశ్వసిస్తుమన్నారు. తమ కుమార్తె మృతిని అధికారికంగా ప్రకటించడానికి కొన్ని చట్టపరమైన విధానాలను అనుసరించాల్సి ఉంటుందని అర్థం చేసుకుంటామని వారు పేర్కొన్నారు.






