Sudiksha Konanki: అమెరికాలో భారత సంతతి విద్యార్థిని మిస్సింగ్.. బీచ్లో ఏం జరిగింది
స్నేహితులతో కలిసి కరీబియన్ దీవుల్లో (Caribbean Islands) విహారయాత్రకు వెళ్లి అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుదీక్ష కోణంకి (Sudiksha konanki) కేసు దర్యాప్తు అధికారులకు అంతు చిక్కటం లేదు. ఆమెకు చెందినవిగా భావిస్తున్న దుస్తులు ఇక్కడి బీచ్ (Beach)లోని లాంజ్ కుర్చీ వద్ద కనిపించాయని, వారం క్రితం అక్కడే ఆమె కనిపించకుకుండా పోయారు. నిఘా కెమెరాల్లో చివరిసారి ఆమెతో కనిపించిన జోష్ రీబ్ (Josh Reeb ) అనే అతన్ని అధికారులు విచారిస్తున్నారు. సుదీక్ష కోణంకి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.






