Elon Musk : ఎలాన్ మస్కు మళ్లీ నిరాశే… వరుసగా ఇది మూడోసారి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk )కు చెందిన స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ ప్రయోగించిన మెగా రాకెట్ స్టార్షిప్ (Starship) మరోసారి విఫలమైంది. తొలుత సవ్యంగానే నింగిలోకి దూసుకెళ్లినా, నిర్ణీత కక్ష్యలోకి చేరుకున్న తర్వాత శాటిలైట్లు (Satellites) ఉన్న పేలోడ్ తలుపులు తెరుచుకోకపోవడంతో నియంత్రణ కోల్పోయి గాల్లోనే పేలిపోయింది. స్టార్షిప్ రాకెట్ ఇలా గాల్లేనే పేలిపోవడం ఇది వరుసగా మూడోసారి. స్టార్షిప్ ప్రాజెక్టులో తొమ్మిదోదైన ఈ ప్రయోగానికి అమెరికా (America) కాలమానాం ప్రకారం మంగళవారం సాయంత్రం 6:36కు టెక్సాస్లోని స్పేస్ఎక్స్ స్టార్బేస్ నుంచి చేపట్టారు. ఈ రాకెట్ ప్రయోగం విఫలమైన విషయాన్ని స్పేస్ఎక్స్ ప్రకటించింది. అయినా ఇబ్బందేమీ లేదని, తదుపరి ప్రయోగాల్లో వేగం పెంచుతామని మస్క్ తెలిపారు.







