ఐరాస వేదికపై గళమెత్తిన భారత మహిళ
నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్యసమితి (యూఎన్) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు. అప్పుడే మహిళలు జీతంలో కోత పడుతుందనే ఆలోచించకుండా సెలవు తీసుకోగలుగుతారని ఆమె అభిప్రాయపడ్డారు. అమెరికాలో న్యూయార్క్ నగరంలో 79వ సర్వసభ్య ప్రతినిధి సభలో సమ్మిట్ ఆఫ్ ది వ్యూచర్ కార్యక్రమంలో రంజితా ప్రియదర్శిని మాట్లాడారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె చాలా కృషి చేస్తున్నారు. రెండోసారి ఐరాస సదస్సుకు హాజరైనందుకు గర్వంగా ఉంది. నెలసరి రోజుల్లో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నదే నా ప్రధాన లక్ష్యం. ఆ రోజుల్లో కూడా ఆ సెలవు తీసుకోదు. కెన్యాలో జరిగిన ఐరాస సదస్సులో తొలిసారి ఈ విషయం గురించి ప్రాస్తావించాను అని ప్రియదర్శిని తెలిపారు.






