Sky Solutions: స్కై సొల్యూషన్స్ సీఈవో అనిల్ కు గ్లోబీ అవార్డు

హైదరాబాద్‌కు చెందిన అనిల్ బోయినపల్లి(Anil Boynapalli) 2025 లీడర్‌షిప్ గ్లోబీ అవార్డు (Globe Award)కు ఎంపికయ్యారు. ఐటీ (IT) రంగంలో సాధించిన విజయాలకు గాను గ్లోబీ సంస్థ ప్రతి ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. అనిల్ స్థాపించిన స్కై సొల్యూషన్స్ (Sky Solutions) సంస్థ అమెరికాలోని వర్జీనియా (Virginia) కేంద్రంగా వివిధ దేశాలకు విస్తరించింది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆ సంస్థ సీఈవోగా అనిల్ సాధించిన విజయాలకు గాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశామని గ్లోబీ సంస్థ తెలిపింది.