BC Bandh:బీజేపీ రాష్ట్రంలో మద్దతిచ్చి .. కేంద్రంలో వెనకడుగు : మంత్రి పొన్నం

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ (Tankbund) అంబేడ్కర్ విగ్రహం వద్ద మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), వాకిటి శ్రీహరి, సీతక్క, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు నిరసన చేపట్టారు. రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రం (BC Bandh) లో ఉన్న బీజేపీని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ బీసీ బంద్‌లో తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. ఇందు కోసం కుల సర్వే నిర్వహించినట్లు తెలిపారు. బీజేపీ (BJP) రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి, కేంద్రంలో మాత్రం వెనుకడుగు వేస్తోందని విమర్శించారు.