Prabhas: ధృవను మిస్ చేసుకున్న డార్లింగ్
ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం, ఆ సినిమాలు హిట్టయ్యాక అయ్యో ఆ సినిమా చేసి ఉంటే బావుండేదని తర్వాత వారి ఫ్యాన్స్ బాధ పడటం చాలా కామన్. అలా ఒకరు చేయాల్సిన సినిమాలు, కొన్ని పరిస్థితుల వల్ల వేరొకరి దగ్గరకు వెళ్లి వారు చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఓ సినిమా గురించి తెలుస్తోంది.
బాహుబలి(Baahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్(Prabhas), ఆ తర్వాత చేసిన జానర్లో సినిమాలు చేయకుండా వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ చాలానే ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. అతని ప్లేస్ లో మరొకరు ఉంటే ఎవరైనా సరే సేఫ్ గా ఆలోచించి సినిమాలు చేసేవాళ్లు. కానీ ప్రభాస్ అలా కాదు.
అలాంటి ప్రభాస్, ఓ క్రేజీ ప్రాజెక్టును మిస్ చేసుకున్నాడు. అదే ధృవ(Dhruva). రామ్ చరణ్(Ram Charan) హీరోగా సురేందర్ రెడ్డి(Surender reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందుగా ప్రభాస్ తోనే చేయాల్సిందని, ఆ సినిమా ఒరిజినల్ అయిన తని ఒరువన్(Thani oruvan) తీసిన మోహన్ రాజా(Mohan Raja) వెల్లడించాడు. ఒకవేళ ప్రభాస్ ధృవ చేసినట్టయితే అప్పట్లోనే ప్రభాస్ ను పోలీసాఫీసర్ గా చూసేవాళ్లం. కాగా ప్రస్తుతం డార్లింగ్, సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్(Spirit) మూవీలో పోలీస్ గా కనిపించనున్నాడు.






