BC Bandh: బీసీ బంద్ విజయవంతం : మహేశ్‌కుమార్ గౌడ్

బీసీ బంద్ విజయవంతమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. బీసీ బంద్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంబర్‌పేట (Amberpet) చౌరస్తా దగ్గర నిర్వహించిన ర్యాలీలో మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు. కుల సర్వే చేశాం. జీవో ఇచ్చాం. బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తాం. ప్రభుత్వ పరంగా 42 శాతంలో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు.