Korean Kanakaraju: కొరియన్ కనకరాజు షూటింగ్ అప్డేట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(varun tej) ఇప్పటివరకు 14 సినిమాలు చేశాడు కానీ అందులో హిట్ అని చెప్పుకునే సినిమాలు చాలా తక్కువ. గత కొన్ని సినిమాలుగా వరుణ్ కు వరుస ఫ్లాపులే ఎదురవుతున్నాయి. కష్టపడి, డిఫరెంట్ గా ఉండాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా బెడిసికొడుతున్నాయి. దీంతో సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు వరుణ్.
అందులో భాగంగానే మేర్లపాక గాంధీ(merlapaka gandhi) దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు వరుణ్. గాంధీ దర్శకత్వంలో ఇప్పటికే నాలుగు సినిమాలు రాగా, మొదటి రెండు సినిమాలూ మంచి హిట్లుగా నిలిచాయి. తర్వాత వచ్చిన రెండు సినిమాలకు మాత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాలేదు. అయినప్పటికీ వరుణ్, గాంధీని నమ్మి అవకాశమిచ్చాడు.
కాగా కొరియన్ కనకరాజు(Korean kanakaraju) మూవీని కేవలం యాక్షన్ జానర్ లోనే కాకుండా కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తున్నాడు గాంధీ. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 80% పూర్తైందని, నవంబర్ ఆఖరి నాటికి బ్యాలెన్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నారని అంటున్నారు. కొరియన్ కనకరాజు మూవీ వరుణ్ కెరీర్లో మంచి సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు మరీ చెప్తున్నారు.