లెబనాన్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై
లెబనాన్ రాజధాని బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బయట కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తిని లెబనాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాయబార కార్యాలయం బయట ఓ వ్యక్తి తుపాకీతో విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. వెంటనే లెబనాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఎదురు కాల్పుల్లో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకొని ఆసుపత్రికి తరలించారు. కాల్పుల జరిపిన వ్యక్తిని సిరియా జాతీయుడిగా గుర్తించారు. ఎందుకు దాడి చేశాడన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.






