Elon Musk : ఎలాన్ మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk)ల మధ్య బంధం బీటలు వారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మస్క్‌కు రష్యా బంపర్ ఆఫర్ (Russia bumper offer) ప్రకటించింది. తమ దేశంలో పొలిటికల్ అసైలమ్ లో ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని పేర్కొంది. రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరషన్ కమిటీ చైర్మన్ దిమిత్రి నోవికోవ్ (Dmitry Novikov) ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తుంది అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన స్నోడెన్ (Snowden)ను రాజకీయ శరణార్థిగా పరిగణిస్తూ రష్యా ఆశ్రయం కల్పించింది. ఈ సందర్భంగా తర్వాత ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.







