Kyiv: రష్యా డ్రోన్ ఎటాక్స్ తో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి..

ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) వరుస డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇన్నాళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో భీకర దాడులు చేస్తోంది. రాత్రి వేళ ఉక్రెయిన్‌పై 315 షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడినట్లు కీవ్ వాయుసేన వెల్లడించింది..
315 డ్రోన్‌లతో పాటు ఉత్తర కొరియాకు చెందిన కేఎన్-23 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు ఇస్కాండర్-కె క్రూయిజ్‌లను ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించింది. 213 డ్రోన్లు, ఏడు క్షిపణులను నేల కూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. రాడార్స్ నుంచి 64 డ్రోన్లు అదృశ్యం అయినట్లు తెలిపింది. రష్యా దాడులతో దక్షిణ నగరంలో ఉన్న ప్రసూతి ఆస్పత్రి, వైద్య పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇటీవలే .. తమదేశంపై దాదాపు 500 డ్రోన్లతో బాంబులు కురిపించిందని, ఇరుదేశాల మధ్య గడచిన మూడేళ్లుగా సాగుతున్న డ్రోన్ దాడుల్లో ఇది అతిపెద్దదని ఉక్రెయిన్ వైమానికదళం ప్రకటించింది. ఓవైపు.. ఇరుదేశాల నడుమ ప్రత్యక్ష శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా ఇంతటి తీవ్ర దాడికి పాల్పడింది.రష్యా.. మధ్య, పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలపై 479 డ్రోన్లతోపాటు 20 క్షిపణుల్ని కూడా ప్రయోగించిందని వైమానికదళం వెల్లడించింది. అయితే ఈ దాడిని తిప్పికొడుతూ 277 డ్రోన్లను, 19 క్షిపణులను గాలిలోనే తాము పేల్చేశామని స్పష్టం చేసింది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలిగాయని వెల్లడించింది. తూర్పు, పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల వెంబడి దాడుల్ని రష్యా ఉద్ధృతం చేసింది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు.
రష్యా జరిపిన దాడుల్లో సెంట్రల్, వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. సెంట్రల్, వెస్ట్ ఉక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా దాడులు జరిపిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం క్లిష్టంగా ఉందని తెలిపారు. పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల మేర రష్యా దాడులు చేసిందని పేర్కొన్నారు. ఆయా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ లోని పౌరుల నివాసాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో దాదాపు 12వేల మందికిపైగా ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే రష్యా మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తోంది.