Vladimir Putin: మూడు రోజుల కాల్పుల విరమణకు పుతిన్ ఆదేశం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఆశ్చర్యకర రీతిలో ఉక్రెయిన్ (Ukraine)తో యుద్ధానికి తాత్కాలికంగా మూడు రోజుల కాల్పుల పాటించాలని తమ సైన్యాలను ఆదేశించారు. మే 8 నుంచి 10 మధ్య కాల్పుల విరమణ ఉంటుందని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ (Kremlin) తెలిపింది. నాజీ జర్మనీ (Germany)పై రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా (Russia) సాధించిన విజయానికి గుర్తుగా మే ఎనిమిదో తేదీ ( ఏడో తేదీ అర్థరాత్రి) నుంచి మే 10 వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని వెల్లడిరచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాల మేరకు మే 9న విజయోత్సవ దినం ( విక్టరీ డే) సందర్భంగా మానవత్వ కోణంలో శత్రువులపై పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ పాటిస్తున్నామని పేర్కొంది.







