93 ఏళ్ల వయసులో మీడియా దిగ్గజం.. మర్దోక్ కు ఐదోసారి
అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకున్నారు. తన కంటే వయసులో 25 ఏళ్లు చిన్నారైన విశ్రాంత పరమాణు జీవశాస్త్రవేత్త ఎలీనా జుకోవాను మనువాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో వీరి వివాహం సంప్రదాయబద్దంగా జరిగింది. ఈ వివాహానికి అమెరికా పుట్‌బాల్ టీమ్ న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రోబెర్ట్ క్రాప్ట్ (82), ఆయన సతీమణి డానా బ్లూమ్‌బెర్గ్(50) హాజరయ్యారు. మర్దోక్‌కు ఇది ఐదో వివాహం. ఆయన మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను విహమాడారు. 1960ల్లో వీరి బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత జర్నలిస్ట్ అన్నా మరియా మన్, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్, అమెరికా జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్నారు.






