యూకే నా సొంతిల్లు.. రిషి సునాక్
త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల తర్వాత తన కుటుంబం అమెరికాకు తరలిపోతుందని సొంత పార్టీలో చక్కర్లు కొడుతున్న వార్తను బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కొట్టిపారేశారు. సునాక్ ఆగ్నేయా ఇంగ్లాండ్‌లోని ఆమెర్శామ్ ప్రాంతంలో కన్జర్వేటివ్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. మాజీ విదేశాంగ మంత్రి, పార్టీ నేత జాక్ గోల్డ్‌స్మిత్ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. అసలు ఆయనతో నేను మాట్లాడక చాలా కాలమైంది. నా విషయాలు ఆయన కెలా తెలుస్తాయి. అయినా నేను బ్రిటన్ను వదిలి అమెరికాకు వెళ్లట్లేను. యూకే నా సొంతిల్లు. ఇక్కడి సౌతాంప్టన్‌లో పుట్టి పెరిగా అని సునాక్ వ్యాఖ్యానించారు.






