మిస్ యూనివర్స్ ఇండియాగా.. రియా సింఘా
గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె త్వరలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉత్కంఠగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే పోటీల్లో రియా సింఘా విజేతగా నిలిచింది. ఫైనల్లో 51 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి రియా ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన రియా సింఘా మిస్ యూనివర్స్ ఈవెంట్ ఈ ఏడాది నవంబర్ 16న మెక్సికోలో జరగనున్నది. మిస్ యూనివర్స్ గెల్చుకున్న తర్వాత గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల రియా సింఘా ఎంతో భావోద్వేగానికిగురైనట్లు తెలుస్తున్నది. తను దీని కోసం ఎంతో కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు మరింత బూస్టింగ్ ఇచ్చిందని కూడా ఈ భామ చెప్పుకొచ్చింది.






