KL Rahul: ఓపెనర్ గానే రాహుల్.. సాయి సుదర్శన్ అక్కడే..?
మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్(England) తో టెస్ట్ సిరీస్ భారత్ ప్రారంభించనుంది. దీనితో ఓపెనర్లు ఎవరు అనేదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనింగ్ జోడి విషయంలో క్లారిటీ రాలేదు. రోహిత్ శర్మ(Rohith Sharma) ఉండటంతో మిడిల్ ఆర్డర్ లో కేఎల్ రాహుల్ ఆడాల్సి వచ్చింది. అయితే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో కంటే ఓపెనర్ గా సమర్థవంతంగా ఆడటంతో.. రాహుల్ ఓపెనింగ్ చేయాలనే డిమాండ్లు తర్వాత ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.
ఇక సాయి సుదర్శన్ పేరు కూడా ప్రముఖంగానే వినపడుతోంది. సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని పలువురు క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక క్రికెట్ విశ్లేషకులు సైతం కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు రావాలని, లేదంటే సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్ గిల్ నాలుగో స్థానంలో ఆడాలని.. కరుణ్ నాయర్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ సీరీస్ లో కెఎల్ రాహుల్ పై ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటన నుంచి రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మెరుగ్గా రాణించాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రాహుల్, ఇంగ్లాండ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సెంచరీ తో రాణించాడు. దీంతో రాహుల్ ఓపెనర్ గా వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ లో రాహుల్ ఓనర్ గా రావడంతో కచ్చితంగా అతను త్వరలో జరగబోయే మొదటి టెస్ట్ లో ఓపెనర్ గా వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు.






