Khameni: ఖమేనీని ఇజ్రాయెల్ ఎలా మట్టుబెట్టిందో తెలుసా?
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి చేపట్టిన అత్యంత రహస్య ఆపరేషన్‌లో ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భారీ వ్యూహం వెనుక ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ఏళ్ల తరబడి చేసిన కృషి ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఏళ్ల తరబడి సాగిన నిఘా
ఖమేనీ కదలికలను గుర్తించడానికి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాల నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. ఏళ్ల తరబడి ఈ కెమెరాల నుండి సేకరించిన ఫుటేజీని ఎన్‌క్రిప్ట్ చేసి రహస్యంగా విశ్లేషించారు. ముఖ్యంగా ఖమేనీ నివాసం ఉండే పెస్టర్ స్ట్రీట్ పరిసరాల్లోని భద్రతా సిబ్బంది వాహనాలు, వారి పార్కింగ్ ప్రదేశాలను ఒక ప్రత్యేక కెమెరా ద్వారా నిత్యం పర్యవేక్షించేవారు. ఖమేనీ ఎవరిని కలుస్తున్నారు, అత్యవసర సమయంలో ఎక్కడికి వెళ్తారు అనే విషయాలను అమెరికా-ఇజ్రాయెల్ నిఘా వర్గాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాయి.
ఇవి కూడా చదవండి
ఏఐ టూల్స్ , సీఐఏ సమాచారం
సేకరించిన భారీ సమాచారాన్ని విశ్లేషించి ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురావడానికి ఇజ్రాయెల్ కృత్రిమ మేధ (AI) టూల్స్ , అత్యాధునిక అల్గారిథమ్స్‌ను ఉపయోగించింది. ఫిబ్రవరి 28న జరిగిన ఈ దాడిలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం కూడా అత్యంత కీలకంగా మారింది. ఇరాన్లో ప్రతి శనివారం నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం వివరాలను ముందే తెలుసుకున్న ఇజ్రాయెల్, టెహ్రాన్ నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ప్రాంగణంపై పక్కా ప్రణాళికతో విరుచుకుపడింది.
ఏకకాలంలో సైబర్ దాడులు
దాడి జరిగిన సమయంలో ఇరాన్ ప్రతిఘటించకుండా ఉండేందుకు జెరూసలెం పోస్ట్ కథనం ప్రకారం ఏకకాలంలో భారీ సైబర్ దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలు, భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థలు, అధికారిక మీడియా వెబ్సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ పడిపోయింది, ఫలితంగా ఇరాన్ ఎదురుదాడి చేసే సామర్థ్యం దెబ్బతింది. “మాకు జెరూసలెం గురించి ఎంత తెలుసో, టెహ్రాన్ గురించి కూడా అంతే బాగా తెలుసు” అని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు పేర్కొనడం వారి నిఘా నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి

















