ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు తోడ్పాటు.. మోదీ
ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు ఎలాంటి తోడ్పాటు అవసరమైనా అందించేందుకు సిద్ధమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఐరాస సమావేశాలకు వచ్చిన మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ న్యూయార్క్‌లో 45 నిమిషాలసేపు ద్వైపాక్షింగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి, స్థిరత్వాలు నెలకొనడానికి అన్నివిధాల మద్దతు ఇస్తామని మోదీ వెల్లడిరచారు. గత నెలలో ఉక్రెయిన్‌కు తాను వెళ్లినప్పుడు తీసుకున్న నిర్ణయాల అమలుపైనా సమీక్షించినట్లు చెప్పారు. దీర్ఘకాలం నిలిచేలా శాంతియుత పరిష్కారం కుదిరేందుకు సంపూర్ణంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. యుద్ధం ముగిసేది ఎప్పుడనేది కాలమే చెబుతుందని, ఘర్షణకు ముగింపు పలకడంపైనే ప్రపంచనేతలందరి దృష్టి ఉందని తెలిపారు. భారత్‌తో వివిధ రంగాల్లో సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి తాము చురుగ్గా ప్రయత్నిస్తున్నామని జెలెన్స్కీ తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై భేటీలను పెంచుకోవాలని, శాంతి సూత్రాన్ని అమలు చేయాలని, రెండో శాంతి సదస్సుకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు.






