వారిని భారత్‌కు అప్పగించండి.. బ్రిటన్ ప్రధానితో మోదీ
బ్రెజిల్ వేదికగా జరుగుతున్న జీ20 సదస్సు లో భాగంగా వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు. ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో జరిగిన సమావేశంలో మోదీ కోరారు. వారితో పాటు పన్ను ఎగవేత, మలీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్ భండారీని కూడా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విజయ్ మల్యా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు నీరవ్ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. అతను కూడా విదేశాలకు పారిపోయాడు.






