Modi: రష్యా విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ దూరం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రష్యా (Russia) పర్యటన రద్దయ్యింది. మే నెలలో రష్యా నిర్వహించనున్న విక్టరీ డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనడం లేదని వెల్లడైంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ (Kremlin) ప్రకటించింది. భారత్(India)-పాక్ (Pakistan) సరిహద్దులోల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోదీ వెళ్లడం లేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ (Germany)పై విజయానికి గుర్తుగా విక్టరీ డే పేరుతో రష్యా ఏటా వేడుకలు జరుపుతుంది. మాస్కోలోని రెడ్ స్క్వేర్లో మే 9న భారీ స్థాయిలో సైనిక కవాతు నిర్వహిస్తారు.







