జి-7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ…

అధికారవాదం, ఉగ్రవాదం, తప్పుడు సమాచారం నుంచి ఉత్పన్నమయ్యే బెదిరింపుల నుంచి భాగస్వామ్య విలువలను రక్షించడంలో జి-7 దేశాలకు భారత్ సహజ మిత్రదేశమని ప్రధాని మోదీ అన్నారు. లండన్‍లోని కార్న్వాల్‍లో జి-7 దేశాల సదస్సు చివరి రోజైన ఆదివారం జరిగిన ఓపెన్ సొసైటీస్ అండ్ ఓపెన్ ఎకనామీస్ అంశంపై నిర్వహించిన సెషనల్‍లో వర్చువల్ పాల్గొన మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యం, ఆలోచనా స్వేచ్ఛ, స్వేచ్ఛా హక్కుల విషయంలో భారత్ తన నిబద్ధతకు కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి), జన్‍ధన్-ఆధార్-మొబైల్ (జెఎఎం) వంటి వ్యవస్థల ద్వారా డిజిటల్ సాంకేతిక భారత్‍లోని సమాజం, సాధికారితపై విప్లవాత్మక ప్రభావం చూపిందని మోదీ అన్నారు. టెక్ కంపెనీలు, సోషల్ మీడియా ఫ్లాట్‍ఫాంలు తన వినియోగదారులకు సురక్షితమైన సైబర్ వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రధాని అభిప్రాయాలను జి-7 దేశాల అధినేతలు ప్రశంసించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సి.హరీస్ పేర్కొన్నారు.