Satya Nadella :ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సమావేశం అయ్యారు. భారత్‌లో మైక్రోసాఫ్ట్ విస్తరణ, పెట్టుబడి ప్రణాళికల గురించి తెలుసుకోవడం సంతోషకంగా అనిపించింది. టెక్, ఇన్నోవేషన్, కృత్రిమ మేధ (ఏఐ) తదితర అంశాలపై జరిపిన చర్చలు అద్భుత ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నా అని ప్రధాని మోదీ (Prime Minister Modi) పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతలో భారత్‌ను ఉన్నతస్థానంలో నిలిపేందుకు తాము కలిసి పనిచేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. ప్రతి భారతీయుడు ఏఐ (AI) ప్రయోజనాలను పొందేలా చూడాలన్నది తమ ఆకాంక్షగా వివరించారు. మైక్రోసాఫ్ట్ (Microsoft )ఖాతాదారులు, ఇతర వాటాదార్ల నుద్దేశించి ఢల్లీి, బెంగళూరుల్లో సత్య నాదెళ్ల ప్రసంగిస్తారు.