ఐరాసలో ప్రధాని మోదీ ప్రసంగం!
ఐక్యరాజ్యసమితి 79వ సర్వ ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 26న మోదీ మాట్లాడే అవకాశం ఉందని ప్రసంగించబోయే నేతల జాబితాను ఐరాస విడుదల చేసింది. జాబితాలో మార్పులు చేర్పులు ఉండొచ్చని తెలిపింది. సెప్టెబర్ 24న సంప్రదాయం ప్రకారం బ్రెజిల్ నేత తొలిసారిగా ప్రసంగిస్తారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రసంగిస్తారు. మూడోసారి ప్రధానిగా పగ్గాలు అందుకున్న మోదీ 2021 సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా ఐరాసలో ప్రసంగించనున్నారు.






