రిషి సునాక్ తో ప్రధాని మోదీ భేటీ.. బ్రిటన్ తో బంధం ఎంతో కీలకం
ఇటలీలో జి 7 సమ్మిట్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో సమావేశం అయ్యారు. ఇరుదేశాల నడుమ సత్సంబంధాలకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రధాని ఈ దశలో బ్రిటన్ పట్ల తమ పాత విధానం కొనసాగుతుందని పరోక్షంగా తెలిపారు. ఇరుదేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) సంప్రదింపుల్లో పురోగతిని కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. అపూలియాలోని లగ్జరీ రిస్టార్ బోర్గో ఎగ్గానిజియా ఇప్పుడు జి 7 సమ్మిట్‌కు వేదిక అయింది. ఇక్కడికి రాగానే ఇరువురు నేతలు సాదరంగా ఆలింగనం చేసుకున్నారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మోదీ తలపెట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే అయింది. బ్రిటన్-భారత్ బంధం అత్యంత కీలకమైదని ప్రధాని మోదీ తెలిపారు. పలు రంగాలు ప్రత్యేకించి సెమికండక్టర్లు, టెక్నాలజీ, వాణిజ్యంలో మరింతగా సహకారం పెంపొందించుకునేందుకు వీలుంది. ఈ దశలో తమ చర్చలు ఫలిస్తాయని కూడా మోదీ తెలిపారు.






