Rohith Sharma: రోహిత్ ను పంపండి.. బీసీసిఐ పై పాక్ సీరియస్
ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకలకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma)ను పాకిస్థాన్‌కు పంపవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. కెప్టెన్ల ఫోటో షూట్, పాకిస్థాన్‌లో జరిగే ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి కూడా రోహిత్ హాజరవుతాడని భావించారు పాక్ అధికారులు. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ తో పాటుగా భారత్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
ఈ తరుణంలో రోహిత్‌ను పాకిస్తాన్‌కు పంపే విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఏ విషయం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ఇదే సమయంలో… భారత జట్టు తమ టోర్నమెంట్ జెర్సీపై పాకిస్థాన్ పేరును ధరించే అవకాశమే లేదని వస్తున్న వార్తలపై పీసీబీ అధికారి ఒకరు అసహనం వ్యక్తం చేసారు. బిసిసిఐ క్రికెట్లోకి రాజకీయాలను తీసుకువస్తోందని మండిపడ్డారు. ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదన్నారు. ఇండియా పాకిస్తాన్‌కు రావడానికి నిరాకరించిందని… భారత్ కు తమ కెప్టెన్‌ను పాకిస్తాన్ కు ప్రారంభ వేడుకలకు పంపడం ఇష్టం లేదన్నారు.
తమ జెర్సీపై ఆతిథ్య దేశం (పాకిస్థాన్) పేరును ముద్రించకూడదని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని సదరు అధికారి అంతర్జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుండగా… ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 2న జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నమెంట్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించగా, కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్‌ని నియమించగా.. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చారు. యశస్వి జైస్వాల్ ను వన్డే జట్టుకు ఎంపిక చేసారు.






