Asim Malik: పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐఎస్ఐ చీఫ్‌కు
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై న్యూఢల్లీి ఏ క్షణమైనా దాడులు చేపట్టొచ్చని పాక్ భయపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ (Asim Malik)కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor )గా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
మాలిక్‌కు ఎన్ఎస్ఏ చీఫ్ (NSA chief) గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయనను గతేడాది సెప్టెంబరులో ఐఎస్ఐ చీఫ్‌గా నియమించారు. నిఘా సంస్థ అధిపతి కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ (Pakistan Army General Headquarters) లో అడ్జుటంట్ జనరల్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల పర్యవేక్షించారు.







