భారత్ కు తిరిగి రానున్న పురాతన విగ్రహం
దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి ఓ సాధువు పురాతన కాంస్య విగ్రహాన్ని తిరిగి భారత్కు అప్పగించేందుకు యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం దాదాపు అంగీకరించింది. తమిళనాడులోని ఓ ఆలయం నుంచి చోరీకి గరైనట్లు భావిస్తున్న సదరు విగ్రహాన్ని 1967లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిధిలోని మ్యూజియం ఒక వేలంలో కొనుగోలు చేసింది. అయితే, 16వ శతాబ్దానికి చెందిన ఆ విగ్రహం సెయింట్ తిరుమన్కై అల్వార్దనీ, దాన్ని తిరిగి తమకు అప్పగించాలని యూకేలోని భారత హైకమిషన్ ప్రతినిధులు ఇటీవల కోరడంతో సదరు మ్యూజియం నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. అక్కడి ఛారిటీ కమిషన్ అనుమతి కూడా వస్తే త్వరలోనే ఆ 60 సెంటీమీటర్ల ఎత్తయిన విగ్రహం భారత్కు చేరనుంది.






