Operation Sindoor : ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు… ఉగ్రవాదంపై
ఆటవిక ఉగ్రవాదంపై పోరాటంలో ఒకే గొంతుక వినిపిద్దామని ప్రపంచ దేశాలకు భారత్ (India) పిలుపునిచ్చింది. పాకిస్థాన్ (Pakistan )ఉగ్రవాదుల పుట్టని, అక్కడే ఎక్కువ మంది ఉగ్రవాదులున్నారని స్పష్టం చేసింది. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ను ప్రపంచ వేదికలపై ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు పలు దేశాలకు వెళ్లాయి. ఆయా దేశాల్లోని నేతలకు, మీడియాకు, మేధావులకు మన ప్రతినిధుల బృందాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor )గురించి వివరిస్తున్నాయి. ఫ్రాన్స్ (France), కువైట్ (Kuwait) , దక్షిణ కొరియా, ఖతార్ (Qatar) , స్లోవేనియా, గుయానాల్లో పర్యటించిన బృందాలు అక్కడి నేతలకు ఉగ్రవాద గ్రూపులకు పాకిస్థాన్ అందిస్తున్న సహకారం గురించి తెలిపాయి.







