America: అమెరికాలో భారత ప్రతినిధి బృందం పర్యటన
ఉగ్రవాదంపై పాకిస్థాన్(Pakistan) తీరును ప్రపంచ వేదికలపై భారత్ సమర్థంగా ఎండగడుతోంది. ఆ దేశం ఉగ్ర సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అయా దేశాలకు వివరించి ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతు కోరుతోంది. మన దేశం చేస్తున్న ఈ ప్రయత్నాలకు భారీగా మద్దతు లభిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో కలిసి నడుస్తామని ఆయా దేశాలు హామీ ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (MP Shashi Tharoor) నేతృత్వలోని అఖిలపక్ష బృందం అమెరికా చేరుకుంది. అనంతరం భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యం లో ఎంపిక చేసిన కొంత మంది భారతీయ అమెరికన్లతో పాటు ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు, మేధావులతో న్యూయార్క్ (New York) లో ఈ బృందం సంభాషించింది. ఏ ఒక్కరూ పాకిస్థాన్‌లో ఉండి, సరిహద్దు దాటి వచ్చి భారతీయులను చంపుతామంటే ఊరుకోబోం. అటవంటి వాటికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. మేం ఉగ్రవాదులకు స్పష్టమైన సందేశం పంపాం. మీరు ప్రారంభిస్తే మేం సమాధానమిస్తాం. 88 గంటల యుద్ధం చేశాం. పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాం అని శశి థరూర్ ఈ సందర్భంగా స్పష్టం చేవారు. శశి థరూర్ బృందంలో టీడీపీ ఎంపీ గంటి హరీస్ మాథూర్ (Ganti Haris Mathur 0 ఉన్నారు. ఈ బృందం గుయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాల్లో పర్యటిస్తోంది.







